Shankar Birthday Special : భారీ చిత్రాలకు చిరునామా… శంకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankar Birthday Special : ఆరంభంలో ఆయన `జెంటిల్ మేన్` శంకర్, తరువాత `జీన్స్` ఆయన ఇంటిపేరుగా కొన్నాళ్లు చెలామణీ అయింది.తెలుగువారు `భారతీయుడు` శంకర్ అనీ అన్నారు. ఇప్పుడేమో `రోబో` శంకర్ అంటున్నారు. ఏది ఏమైనా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ పేరు వినగానే ఆయన రూపొందించిన భారీ చిత్రాలు మన స్మృతిపథంలో పరుగులు తీస్తాయి. శంకర్ చిత్రాలను గమనిస్తే, వాటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ చిందులు వేస్తూ కనిపిస్తుంది. అందుకే కొందరు ఆయనను ‘హై టెక్ డైరెక్టర్’ అన్నారు. ఆ మాటను నిలుపుకుంటూనే శంకర్ తనదైన పంథాలో పయనిస్తున్నారు.
శంకర్ 1963 ఆగస్టు 17న తమిళనాడులోని కుంబకోణంలో జన్మించారు. ఆయనకు బాల్యం నుంచీ సినిమాలంటే ఎంతో అభిమానం. ఆయన అభిమాన నటుడు ఎమ్జీఆర్. సినిమాలు చూడడం, వాటిలోని సీన్స్ కు సొంతగా తాను రచన చేసి ఆనందించేవారు. చదువుకొనే రోజుల్లోనే మిత్రులతో కలసి నాటకాలు వేసేవారు. అలా చేస్తూనే మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు శంకర్. ఆయన రాసిన ఓ నాటకం చూసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్, శంకర్ ను చిత్రసీమకు ఆహ్వానించారు. అలా రచయితగా అడుగు పెట్టిన శంకర్ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఆపై ఎస్.ఏ.చంద్రశేఖర్, పవిత్రన్ వద్ద అసోసియేట్ గా పనిచేశారు. మెల్లగా తన ఆలోచనలకు తగ్గ కథలు రాసుకుంటూ ముందుకు సాగారు. కొత్తవారిని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్న కె.టి.కుంజుమోన్ కు శంకర్ తన ‘జెంటిల్ మేన్’ కథ వినిపించారు. అది ఆయనకు నచ్చడం, తరువాత శంకర్ కోరినవన్నీ సమకూర్చడం ఇట్టే జరిగిపోయాయి. ఈ సినిమాను తెలుగులో ఎ.ఎమ్.రత్నం అదే టైటిల్ తో డబ్ చేశారు. ‘జెంటిల్ మేన్’ తమిళ, తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ స్వరకల్పన పెద్ద ఎస్సెట్ గా నిలచింది. ‘జెంటిల్ మేన్’లో “చుకు బుకు చుకు బుకు రైలే…” పాటలో స్సెషల్ ఎప్పియరెన్స్ ఇచ్చిన డాన్స్ మాస్టర్ ప్రభుదేవాను ‘కాదలన్’తో హీరోని చేసేశారు శంకర్. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమికుడు’ పేరుతో అనువాదమై అలరించింది. శంకర్ రెండు చిత్రాలను తెలుగులోకి అనువదించిన ఎ.ఎమ్.రత్నం ఆయన మూడో చిత్రాన్ని నిర్మించారు. అదే ‘ఇండియన్’. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో విడుదలై ఇక్కడా విజయఢంకా మోగించింది. ఈ మూడు చిత్రాలకు ఎ.ఆర్.రహమాన్ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఈ సినిమాల్లో శంకర్ పనితనం జనాన్ని ఇట్టే పట్టేసింది. దాంతో శంకర్ సినిమా కోసం జనం ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
- Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
- Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
- Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
‘ఇండియన్’ తరువాత ‘జీన్స్’తోనూ మురిపించారు శంకర్. ఈ సినిమా అయ్యాక నిర్మాతగా మారారు శంకర్. తన తొలి హీరో అర్జున్ తో ‘ముదలవాన్’ నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘ఒకే ఒక్కడు’గా అనువాదమై అక్కడా, ఇక్కడా ఘనవిజయం సాధించింది. శంకర్ కు తిరుగులేదు అన్నట్టుగా సాగిపోయారు. ఆయనతో సినిమాలు చేయడానికి టాప్ స్టార్స్ ఎందరో ఆసక్తి చూపించారు. అయితే ‘ఒకే ఒక్కడు’ను హిందీలో ‘నాయక్’ పేరుతో శంకర్ దర్శకత్వంలోనే రీమేక్ చేశారు ఎ.ఎమ్.రత్నం. ఆ సినిమా ఫ్లాప్ అయింది. శంకర్ కెరీర్ లో తొలి ఫ్లాప్ గా ‘నాయక్’ నిలచింది.
ఎమ్జీఆర్ తరువాత తాను ఎంతగానో అభిమానించే రజనీకాంత్ తో సినిమా తీయాలని శంకర్ తపించారు. ఆయన కోసం ‘శివాజీ’ కథ తయారు చేసుకున్నారు. మధ్యలో కుర్రకారుతో ‘బోయ్స్’ తీస్తే అది యువతను మాత్రం ఆకట్టుకోగలిగింది. రజనీకాంత్ తో శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘శివాజీ’ మంచివిజయం సాధించింది. భారీ వసూళ్ళు చూసినా, ‘భారతీయుడు’ స్థాయిలో శంకర్ కు పేరు సంపాదించలేకపోయింది. తన అభిమాన హీరోతో ఎలాగైనా భారీ హిట్ పట్టాలని శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘యందిరన్’. ఇదే తెలుగులో ‘రోబో’గా అనువాదమై అఖండ విజయం చూసింది. ‘శివాజీ, రోబో’ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. తరువాత ఎందుకనో శంకర్ హిందీలో విజయం సాధించిన ‘3 ఇడియట్స్’ను ‘నన్బన్’ పేరుతో రీమేక్ చేశారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన తొలి రీమేక్ ఇది. తెలుగులో ‘స్నేహితుడు’గా వచ్చింది. అంతగా ఆకట్టుకోలేకపోయింది. విక్రమ్ తో అంతకు ముందు ‘అపరిచితుడు’ తీసి విజయం సాధించిన శంకర్, తరువాత ఆయనతో ‘ఐ’ తెరకెక్కించారు. ఈ సినిమా అలరించలేక పోయింది. ‘రోబో’ సీక్వెల్ గా రజనీకాంత్ తోనే ‘2.0’ తెరకెక్కించారు శంకర్. ఇది కూడా ఓపెనింగ్స్ తోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. నిర్మాతగా తన అసోసియేట్స్ డైరెక్షన్ లోనూ సినిమాలు నిర్మించారు శంకర్.
ప్రస్తుతం ‘ఇండియన్’ సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం కారణంగా ఈ సినిమా నిర్మాణంలో జాప్యం జరిగింది. ఆ పై ఎందుకనో ఆ సినిమా ముందుకు సాగలేదు. రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మించే చిత్రంతో తొలిసారి తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్. ఇప్పటికే తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న శంకర్ మరి ఈ సినిమాతో తెలుగువారిని ఏ రీతిన మెప్పిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!