అంజలి .. అంజలి.. అంజలి .. మెరిసే నవ్వుల పువ్వుల జాబిల్లీ అంటూ అందరి చేత పాడించుకున్న బేబీ షామిలి అందరికి గుర్తుండే ఉంటుంది. ఓయ్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ చైల్డ్ ఆరిస్ట్ మొదటిసినిమాతోనే నెటిజన్స్ ట్రోలింగ్ బారిన పడింది. బొద్దుగా ఉంది.. ముఖంలో కళ లేదు అంటూ ట్రోల్ చేసిన ట్రోలర్స్ కి ధీటుగా సమాధానం చెప్తూ బొద్దుగా ఉన్న షామిలి తగ్గి చక్కని రూపాన్ని సొంతం చేసుకుంది. దాంతోనే నాగ శౌర్య సరసన అమ్మమ్మగారిల్లు లో కనిపించింది. అయినా అమ్మడిని మాత్రం ఎవరు హీరోయిన్ గా గుర్తించలేదు. ఈ రెండు సినిమాల తరువాత షామిలీ చదువు పూర్తిచేయడంలో నిమగ్నమయ్యి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక తాజాగా షామిలీ కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
షామిలీ అక్క షాలిని కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య అన్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ ఫ్యామిలీ ఒక ఫంక్షన్ లో కనిపించి కనువిందు చేశారు. మొన్నటికి మొన్న అజిత్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ కాగా.. తాజాగా ఆ ఫొటోలో షామిలీ టక్కున మెరిసి వైరల్ గా మారింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు పట్టు చీరలో అమ్మడు అందంగా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌస్.. దానికి తగ్గట్టుగా ముడి వేసిన జుట్టుతో షామిలీ సరికొత్త లుక్ లో అదరగొట్టింది. అక్క షాలిని, ఆమె కూతురు అనోష్క అజిత్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే మునుపటి అందం లేదని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు… ఈ అమ్మాయి బేబీ షామిలీనా గుర్తుపట్టలేకున్నామే అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. మరి షామిలీ ఇక నుంచి సినిమాల్లో కనిపిస్తుందా..? లేదా అనేది తెలియాలి.
