Shahrukh Khan Fan Requests To Buy A Pathan Movie Ticket For Him: సినిమాలు చూడటమనేది ‘బ్రహ్మవిద్యేమీ’ కాదు. మన దగ్గర డబ్బులుంటే, సినిమా చూడాలని అనిపిస్తే.. వీలు చూసుకొని వెళ్తాం. లేకపోతే లేదు.. అంతే! ఇక సినిమా పిచ్చోళ్లు అయితే.. ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేసుకొని, మొదటి షో చూసేందుకు థియేటర్లపై ఎగబడుతుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఒక అభిమాని మాత్రం హద్దులు మీరాడు. తనకు టికెట్ కొనిపించాలని, లేకపోతే చచ్చిపోతానంటూ ట్విటర్ మాధ్యమంగా కోరాడు. టికెట్ కోరడం వరకు ఓకే గానీ.. చచ్చిపోతానంటూ ఆతడు చేసిన స్టేట్మెంటే, నెటిజన్లకు కోపం తెప్పించింది. దీంతో, అతడిపై ఎటాక్‌కి దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Air India Incident: పీ గేట్ వివాదం.. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షలు జరిమానా..పైలెట్‌పై చర్యలు
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఫఠాన్’ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల అవుతున్న విషయం అందరికీ తెలిసిందే! ‘జీరో’తో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడం, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందిన స్పై సినిమా కావడంతో.. దీనిపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా చూడాలన్న ఆశతో అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు 25వ తేదీ వస్తుందా? ఈ సినిమా చూస్తామా? అని ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఒక అభిమాని మాత్రం తన వద్ద ఈ సినిమా టికెట్ కొనేందుకు డబ్బులు లేక, ట్విటర్ మాధ్యమంగా రిక్వెస్ట్ చేశాడు. తనకు పఠాన్ సినిమా టికెట్ ఇప్పించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రియాన్ అనే ఫ్యాన్ ఒక వీడియో షేర్ చేశాడు.
INDvsNZ: రెండో వన్డేకు ముందు టీమిండియాకు షాక్..భారీ జరిమానా
‘‘నేను షారుఖ్ ఖాన్‌కు వీరాభిమానిని. ఈనెల 25న వస్తున్న పఠాన్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అయినా చూడాలి, అలాగే షారుఖ్‌ని కూడా కలవాలి. కానీ, నా దగ్గర టికెట్ కొనడానికి డబ్బుల్లేవు. ప్లీజ్.. ఎవరైనా నాకు టికెట్ కొనివ్వండి, నాకు సహాయం చేయండి, లేకపోతే ఈ పౌండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ రియాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు అతనికి మద్దతుగా స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. ‘‘కేవలం సినిమా కోసం, నీ జీవితాన్ని పోగొట్టుకుంటావా? నీ వల్ల ఈ దేశానికి, నీ కుటుంబానికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అంటూ మండిపడుతున్నారు. సినిమా కోసం ఇంత డ్రామా అవసరం లేదంటూ ఏకిపారేస్తున్నారు. ఏదేమైనా.. ఈ వీడియో పుణ్యమా అని రియాన్ బాగా వైరల్ అవుతున్నాడు.
https://twitter.com/Riyan0258/status/1616015052255158273?s=20&t=19ltyN30RkO-zp-FLGkoDg