కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో ఇచ్చిన కంబ్యాక్… ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని రేంజ్ లో ఉంది. అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్… పఠాన్, జవాన్ సినిమాలతో 2500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు ఎంటైర్ బాలీవుడ్ నే బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసాడు. ఇలా రెండు హిట్స్ కొట్టిన షారుఖ్ ఖాన్… మూడో సినిమా డంకీతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. డిసెంబర్ 22న రిలీజైన డంకీ సినిమాని రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ డైరెక్షన్-షారుఖ్ ఖాన్ హీరో అనగానే డంకీ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అంచనాలకి తగ్గట్లు డంకీ భారీగా రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.
సలార్ తో క్లాష్ విషయం పక్కన పెడితే డంకీ సినిమా అసలు రాజ్ కుమార్ హిరాణీ రేంజ్ మూవీ కాదు, షారుఖ్ ఖాన్ చేయాల్సిన సినిమా కాదు అంటూ కామెంట్స్ వినిపించాయి. డంకీ మూవీలో రాజ్ కుమార్ సినిమాల్లో ఎప్పుడూ ఉండే మ్యాజిక్ మిస్ అయ్యింది, ఇదే ఆడియన్స్ ని సినిమాకి కాస్త దూరం చేసింది. క్రిటిక్స్, ఆడియన్స్ డంకీ సినిమాని సైడ్ చేసినా కూడా ఫ్యాన్స్ మాత్రం షారుఖ్ ని వదలలేదు. వరల్డ్ వైడ్ ఇప్పటివరకు 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది డంకీ సినిమా. మొదటి రోజు మార్నింగ్ షోకి నెగటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ 400 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వడం అంటే మాటలు కాదు. షారుఖ్ కి ఉన్న ఇమేజ్ అండ్ పఠాన్-జవాన్ సినిమాల ఇంపాక్ట్ కారణంగానే డంకీ సినిమా ఆ మాత్రం కలెక్షన్స్ ని రాబట్టింది. కథ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే డంకీ మూవీ షారుఖ్ ఖాన్ కి హ్యాట్రిక్ సినిమా అయ్యేది.