NTV Telugu Site icon

Shahrukh Khan: కింగ్ ఆఫ్ బాలీవుడ్… రొమాన్స్‌కి స‌రికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడా?

Shahrukh Khan

Shahrukh Khan

బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ని అందరూ కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటారు. లవ్ స్టోరీస్, లవ్ సీన్స్ లో షారుఖ్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజులో ఉంటుంది. అయితే లేటెస్ట్ గా తన కంబ్యాక్ తర్వాత షారుఖ్ ఖాన్ రొమాన్స్ విషయంలో రూటు మార్చినట్లు ఉన్నాడు.

షారూక్ ఖాన్‌, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న డంకీ నుంచి రీసెంట్‌గా ‘లుట్ పుట్ గయా..’ అనే సాంగ్‌ను ‘డంకీ డ్రాప్ 2’గా మేక‌ర్స్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. హార్డీ పాత్ర‌లో షారూక్‌, మ‌ను పాత్ర‌లో తాప్సీ మ‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే ఈ పాట‌కు వ‌ర‌ల్డ్ వైడ్ అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు సంగీతాభిమానులు సైతం ఈ పాట‌కు ఫిదా అయ్యారు. ఇప్పుడు మ‌రోసారి జ‌వాన్ సినిమాలో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్‌ను షారూక్ డంకీలోనూ తాప్సీతో రిపీట్ చేస్తున్నారు. ఈ విష‌యం తెలిసిన నెటిజ‌న్స్ దీని గురించి సోష‌ల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. షారూక్‌, దీపిక మ‌ధ్య జ‌వాన్ మూవీలో చూపించిన కుస్తీ సీన్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను డంకీలోనూ రిపీట్ చేయ‌బోతున్నారు కింగ్ ఖాన్‌. దీని గురించి ఫ్యాన్స్ చాలా ఎగ్జ‌యిట్ అవుతూ షారూక్ స‌రికొత్త రొమాంటిక్ పంథాను క‌నుగొన్నార‌ని మాట్లాడుకుంటున్నారు.