Shahrukh Khan Accepts BJP Leader Gautam Girish Challenge: పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ పాట ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు! హిందూ సంఘాల దగ్గర నుంచి బీజేపీ నేతల దాకా.. ప్రతిఒక్కరూ ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. దీపికా పదకొనె ధరించిన కాషాయం రంగు బికినీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అది తమ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ సీన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సినిమానే రిలీజ్ కాకుండా నిషేధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బేషరమ్ రంగ్ పాట చాలా అసభ్యకరంగా ఉందన్నారు. అంతేకాదు.. తన కూతురితో కలిసి షారుఖ్ ఖాన్ ఆ సినిమాని చూడాలని, అలాగే తన కూతురితో కలిసి ఆ సినిమాని చూసినట్టు ఓ ఫోటో అప్‌లోడ్ చేసి ప్రపంచానికి నిరూపించాలని సవాల్ చేశారు.
Varun Tej: వరుణ్ తేజ్ నెక్ట్స్ టైటిల్ రివీల్.. అదిరిందయ్యా ‘అర్జున’
ఆ సవాలును షారుఖ్ ఖాన్ స్వీకరించాడు. తన కూతురు సుహానా ఖాన్‌తోనే కాదు.. భార్య గౌరీ, తనయుడు ఆర్యన్ ఖాన్‌తో కలిసి నిన్న ముంబైలో పఠాన్ సినిమాను చూశాడు. జనవరి 25వ తేదీన పఠాన్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్‌లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. సినిమా ప్రదర్శన అనంతరం అందరూ చాలా సంతోషంగా బయటకు వస్తూ.. కెమెరాలకు చిక్కారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. స్పీకర్ గిరీశ్ గౌతమ్ చేసిన సవాల్‌కు షారుఖ్ సమాధానం ఇచ్చాడంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కాగా.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జావన్ అబ్రహం నెగెటివ్ రోల్‌లో నటించాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో షారుఖ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
Twitter layoff: మస్క్ షాకింగ్ నిర్ణయం..మరోసారి ఉద్యోగాల కోత!