Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shahid Kapoors Jersey Postponed Again

Jersey : మేకర్స్ షాకింగ్ డెసిషన్… రిలీజ్ వాయిదా !

Published Date :April 11, 2022 , 1:14 pm
By Prakash
Jersey : మేకర్స్ షాకింగ్ డెసిషన్… రిలీజ్ వాయిదా !
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన “జెర్సీ” మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. నాని హీరోగా నటించిన “జెర్సీ” తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో “జెర్సీ” చిత్రం షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హిందీలో రీమేక్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో మరోసారి తన సత్తా చాటిన షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమా ‘జెర్సీ’ని హిందీలోనూ అదే పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే విడుదలకు సిద్ధమైంది. అయితే కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేశారు. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయబోతున్నామని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. అయితే చివరి క్షణంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 22న భారీగా విడుదల కానుంది.

Read Also : Akhil Akkineni : వైజాగ్ లో “ఏజెంట్”కు గ్రాండ్ వెల్కమ్

అయితే హిందీ “జెర్సీ” మూవీ రిలీజ్ వాయిదా పడడానికి కారణం సౌత్ సినిమాలే. దళపతి విజయ్ “బీస్ట్”, యష్ “కేజీఎఫ్ 2” సినిమాలు ఒకరోజు గ్యాప్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొనబోతున్నాయి. ఏప్రిల్ 13న “బీస్ట్” వస్తే, 14నే “కేజీఎఫ్ 2” రిలీజ్ కానుంది. రెండు సినిమాలూ పాన్ ఇండియానే. పైగా భారీ అంచనాలున్న సినిమాలు. ఈ రెండు సినిమాల మధ్య “జెర్సీ” విడుదలైతే మేకర్స్ నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు “జెర్సీ” మూవీ విడుదలను మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఏదేమైనా నిర్మాతలు తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పొచ్చు.

ఒరిజినల్ ‘జెర్సీ’కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ తో పాటు పంకజ్ కపూర్ కీలక పాత్రలో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు, ఎస్ నాగ వంశీ ‘జెర్సీ’ని సంయుక్తంగా నిర్మించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Gautham Thinnanuri
  • Jersey Movie
  • Jersey Postponed
  • Mrunal Thakur
  • Shahid Kapoor

తాజావార్తలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions