నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ బయటకి వచ్చిన ఈ సీజన్ లో 6వ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ బయటకి రావడానికి రెడీగా ఉంది. గత అయిదు ఎపిసోడ్స్ లో పొలిటిషియన్స్, యంగ్ హీరోస్, ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు బాలయ్య. అయితే అన్ని షర్ట్స్, పాంట్స్ అయిపోయాయి తప్ప చీరలు, డ్రెస్సులు తక్కువ అయ్యాయి. అదే షోకి ఎక్కువగా మేల్ స్టార్స్ వస్తున్నారు కానీ ఫిమేల్ స్టార్స్ రావట్లేదు అనే మాటుంది. నాలుగో ఎపిసోడ్ లో సీనియర్ హీరోయిన్ ‘రాధిక’ కాసేపు కనిపించింది కానీ ఆమెది ఫుల్ ఎపిసోడ్ కాదు. ఫిమేల్ స్టార్స్ కనిపించట్లేదు అనే కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘అన్ స్టాపబుల్’ షో రన్నర్స్ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తో పాటు ఒక యంగ్ హీరోయిన్ ని కూడా రంగం లోకి దించారు.
వచ్చే వారం ప్రీమియర్ కానున్న ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ ఎపిసోడ్ 6లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి బాలయ్యతో పాటు సహజనటి జయసుధ, ఎటర్నల్ బ్యూటీ జయప్రధ, యంగ్ బ్యూటీ రాశీ ఖన్నాలు షోకి రానున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ వచ్చే వారం షోకి రాబోయే గెస్టులు ఎవరో గెస్ చేయండి అంటూ ‘ఆహా’ వాళ్లు ట్వీట్ చేశారు. కొన్ని హింట్స్ ఇవ్వడంతో, ఆడియన్స్ అందరూ రాబోయేది జయసుధ, జయప్రధ, రాశీ ఖన్నా అంటూ గెస్ చేసేశారు. రామారావుతో సినిమాలు చేసిన హీరోయిన్స్ తో బాలయ్య ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ ఎపిసోడ్ 7కి బాహుబలి ప్రభాస్ ని రంగంలోకి దించారు. డిసెంబర్ 30న టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే బయటకి వచ్చి 1 క్రోర్ వ్యూస్ రాబట్టింది. ఆహా నుంచి బయటకి వచ్చిన ఒక వీడియో ఈ రేంజులో యుట్యూబ్ ని షేక్ చెయ్యడం ఇదే మొదటిసారి.