Today (30-12-22) Business Headlines: ‘హైదరాబాద్ చాక్లెట్’ కొన్న రిలయెన్స్: సీనియర్ మోస్ట్ సినీ నటి శారద మరియు విజయ రాఘవన్ నంబియార్ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటల్ చాక్లెట్ కంపెనీని.. రిలయెన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్ కంపెనీ ప్రస్తుతం సింగపూర్ సంస్థ సన్‌షైన్ అలైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అనుబంధంగా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.
సౌత్ లోని పలు భాషల్లో నటించి ఊర్వశిగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి శారద. తాజాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ తనకేం కాలేదని, ఆరోగ్యంగా ఉన్నాను అని వెల్లడించారు. ఆమె ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ “నేను చెన్నైలోని నా ఇంట్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తలు అవాస్తవం” అని తెలిపారు. దీంతో నెట్టింట్లో…