టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మక రాజకీయ డ్రామా చిత్రం ‘లీడర్’ సినీ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినా, దాని కథనం, దర్శకత్వ శైలి మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లీడర్ 2’ రాబోతుందన్న వార్తల పై భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై శేఖర్ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : SSMB 29 : SSMB 29 : జక్కన్న.. నువ్వు మామూలోడివి కాదయ్యా
‘లీడర్ 2 గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. స్టోరీ కూడా నాక్కొంచెం క్లారిటీగా ఉంది. కానీ ‘లీడర్’ చేసినప్పుడు ఉన్న పరిస్థితులు, ప్రేక్షకుల అభిరుచి, ఆలోచన విధానం అన్నీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు చేయాలంటే ఆ మార్పుల్ని పట్టి చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. దీంతో ‘లీడర్ 2’ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉందనే స్పష్టత రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా ‘కుబేర’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాతే ‘లీడర్ 2’ పై స్పష్టమైన అప్‌డేట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.