టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మక రాజకీయ డ్రామా చిత్రం ‘లీడర్’ సినీ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినా, దాని కథనం, దర్శకత్వ శైలి మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లీడర్ 2’ రాబోతుందన్న వార్తల పై భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా…