న్యూ డైరెక్టర్ జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సెహరి” చిత్రంతో హర్ష కనుమిల్లి హీరోగా పరిచయం అవుతున్నాడు. సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. “సెహరి” ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. ఇందులో అసలు “సెహరి” అంటే ఏంటో కూడా తెలియజేస్తుంది. ట్రైలర్ హర్ష్ ఒక సాధారణ హ్యాపీ గో లక్కీ వ్యక్తిగా కన్పించాడు. చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేయగా ఈ యంగ్ హీరో సిమ్రాన్ చౌదరిలో తన సోల్ మేట్ ను చూస్తాడు. కానీ కథలో ట్విస్ట్ ఏమిటంటే ఆమె అతని కంటే నాలుగేళ్లు పెద్దది. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అక్క.
Read Also : “వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?
అదృష్టవశాత్తూ సిమ్రాన్ కూడా అతని వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుంది. పెళ్లిని ఆపడానికి అతనికి ఎక్కువ సమయం కూడా లేకవపోవడం, కథాంశం ఆసక్తికరంగా ఉంది. జ్ఞానసాగర్ వినోదభరితమైన కథనంతో న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా దీన్ని రూపొందించారు. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన మనోహరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.