“ఎస్ఆర్ కళ్యాణమండపం”తో మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు మళ్లీ “సెబాస్టియన్ పీసీ 524″తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఈరోజు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ “సెబాస్టియన్ పిసి 524” థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ బాగుందన్న విజయ్ చిత్రబృందాన్ని అభినందించారు.
Read Also : Bheemla Nayak : ట్యాలెంటెడ్ బ్యూటీ డీప్ గా హర్ట్ అయినట్టుందిగా !?
ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. హీరోకి రే చీకటి ఉండడం సరికొత్త కాన్సెప్ట్. ట్రైలర్‌లో కిరణ్ అబ్బవరంను పోలీస్ కానిస్టేబుల్‌గా చూపించారు. సెబాస్టియన్ తనకున్న రేచీకటి కారణంగా నైట్ డ్యూటీలు చేయడానికి భయపడతాడు. దొంగతనాన్ని ఆపడంలో విఫలమైనందుకు డిపార్ట్‌మెంట్ అతన్ని సస్పెండ్ చేస్తుంది. ఓ రోజు పట్టణంలో ఓ వివాహితను ఎవరో చంపి పోలీసులకు సవాల్ విసిరినట్టు ట్రైలర్ లో చూపించారు. అయితే సస్పెండ్ అయిన కానిస్టేబుల్ హంతకుడిని ఎలా వెంబడించాడు ? అన్నది పెద్ద స్క్రీన్‌పై చూడాల్సిన మిగతా కథ.
కాన్సెప్ట్, కిరణ్ అబ్బవరం పాత్ర బాగుంది. గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను ఎలివేట్ చేసింది. విజువల్స్ కూడా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నువేక్ష, కోమలి ప్రసాద్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ నటి రోహిణి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. జోవిత సినిమాస్ బ్యానర్‌పై సిద్దారెడ్డి బి, రాజు, ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.