కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మావీరన్’. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మావీరన్’ నుండి మొదటి సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మావీరన్’ సినిమా నుంచి ‘సీన్ సీన్’ అనే సాంగ్ బయటకి వచ్చింది. భరత్ శంకర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ పాడాడు. అనిరుద్ వాయిస్ లో ఉండే ఎనర్జీ ఈ సాంగ్ ని మరో లెవల్ కి తీసుకోని పోయింది. కోలీవుడ్ లో శివ కార్తికేయన్, అనిరుద్ లది మంచి హిట్ కాంబినేషన్ అనే పేరుంది. ఆ మాటని ‘సీన్ సీన్’ సాంగ్ మరోసారి నిజం చేసి చూపించింది. చాలా క్యాచీగా, వినగానే హమ్ చేసే విధంగా ఉన్న ‘సీన్ సీన్’ సాంగ్ డ్రమ్స్ బీట్స్ తో జోష్ ఫుల్ గా స్టార్ట్ అయ్యి, ఫుల్ ఆఫ్ లైఫ్ తో ఎండ్ అయ్యింది.
మావీరన్ సినిమాలో ఈ ఒక్క పాట కోసం శివకార్తికేయన్, 500 మంది కళాకారులతో కలిసి డాన్స్ చేశాడు. ఈ ఎపిసోడ్ ని చిత్ర యూనిట్ మోకోబోట్ కెమెరాను ఉపయోగించి షూట్ చేశారు. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన శివ కార్తికేయన్, లాస్ట్ మూవీ ‘ప్రిన్స్’తో భారి ఫ్లాప్ ని ఇచ్చాడు. బయ్యర్స్ ని బాగా నష్ట పరిచిన ఈ మూవీ ఇంపాక్ట్ పోవాలి అంటే శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో మస్ట్ అండ్ షుడ్ గా హిట్ కొట్టాలి. మరి శివ కార్తికేయన్, అశ్విన్ కలిసి ఏం చేస్తారో చూడాలి.
Here is the first single from #Maaveeran #SceneAhSceneAh – https://t.co/8nmbtPGvJ7
Sung by our dearest Rockstar @anirudhofficial 😎
A @bharathsankar12 Musical!🥁
🕺by @shobimaster
✍🏼 #Kabilan & @CMLOKESH @madonneashwin @AditiShankarofl @vidhu_ayyanna @philoedit @iamarunviswa— Sivakarthikeyan (@Siva_Kartikeyan) February 17, 2023