Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!

Yogibabu Satya Movie

Yogibabu Satya Movie

ప్రెజెంట్ డే టాలీవుడ్, కోలీవుడ్ కామెడీ కింగ్స్ ఇద్దరు ఒకేసారి తెరపై కనిపిస్తే ఆ కిక్కే వేరు! టాలీవుడ్‌లో తనదైన పంచులతో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ‘సత్య’, కోలీవుడ్ స్టార్ కమెడియన్ ‘యోగి బాబు’ ప్రధాన పాత్రల్లో ఓ క్రేజీ ఎంటర్‌టైనర్ పట్టాలెక్కింది. నాగశౌర్య ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను.. నాగార్జున రెడ్డితో కలిసి డైరెక్టర్ పవన్ బసంశెట్టి స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ముహూర్తపు షాట్‌కు డైరెక్టర్ కిషోర్ తిరుమల క్లాప్ కొట్టగా, మహేష్ బాబు పి. కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్లు యధువంశీ, సందీప్ రాజ్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం, సత్య – యోగి బాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో నేడు రెగ్యులర్ షూటింగ్‌ను సైతం స్టార్ట్ చేసేశారు. తన ఫస్ట్ మూవీ ‘రంగబలి’లో సత్య కామెడీ ట్రాక్‌తో హైలైట్ చేసిన పవన్ బసంశెట్టి.. ఈసారి సత్య, యోగి బాబుల అద్భుతమైన కామెడీ టైమింగ్‌ను ఫుల్‌గా వాడుకునేలా అదిరిపోయే క్యారెక్టర్స్ డిజైన్ చేశారట. మలయాళ బ్లాక్‌బస్టర్స్‌కు పనిచేసిన బాబ్లు అజు కెమెరామెన్‌గా, పవన్ CH సంగీత దర్శకుడిగా, కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కంప్లీట్ లాఫ్ రైడ్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.