Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రెజెంట్ డే టాలీవుడ్, కోలీవుడ్ కామెడీ కింగ్స్ ఇద్దరు ఒకేసారి తెరపై కనిపిస్తే ఆ కిక్కే వేరు! టాలీవుడ్‌లో తనదైన పంచులతో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ‘సత్య’, కోలీవుడ్ స్టార్ కమెడియన్ ‘యోగి బాబు’ ప్రధాన పాత్రల్లో ఓ క్రేజీ ఎంటర్‌టైనర్ పట్టాలెక్కింది. నాగశౌర్య ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను.. నాగార్జున రెడ్డితో కలిసి డైరెక్టర్ పవన్ బసంశెట్టి స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ముహూర్తపు షాట్‌కు డైరెక్టర్ కిషోర్ తిరుమల క్లాప్ కొట్టగా, మహేష్ బాబు పి. కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్లు యధువంశీ, సందీప్ రాజ్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం, సత్య – యోగి బాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో నేడు రెగ్యులర్ షూటింగ్‌ను సైతం స్టార్ట్ చేసేశారు. తన ఫస్ట్ మూవీ ‘రంగబలి’లో సత్య కామెడీ ట్రాక్‌తో హైలైట్ చేసిన పవన్ బసంశెట్టి.. ఈసారి సత్య, యోగి బాబుల అద్భుతమైన కామెడీ టైమింగ్‌ను ఫుల్‌గా వాడుకునేలా అదిరిపోయే క్యారెక్టర్స్ డిజైన్ చేశారట. మలయాళ బ్లాక్‌బస్టర్స్‌కు పనిచేసిన బాబ్లు అజు కెమెరామెన్‌గా, పవన్ CH సంగీత దర్శకుడిగా, కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కంప్లీట్ లాఫ్ రైడ్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!