సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘మాయోన్’ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాడు మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ ‘పురాతన దేవాలయానికి సంబంధించిన రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’.


గాడ్ వెర్సస్ సైన్స్ థీమ్ తో రూపొందిన ఈ మిస్టరీ థ్రిల్లర్ కు తమిళ నిర్మాత అరుణ్ మోజి మాణికం స్క్రీన్ ప్లే రాయడం విశేషం. సెన్సార్ పూర్తయిన ఈ సినిమాక క్లీన్ యు లభించింది. ఇక ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందులో హీరో సిబిరాజ్ ఆర్కియాలజిస్ట్ గా తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో నటించారు. ఈ సినిమాతో సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ కి తెలుగులోనూ గుర్తింపు వస్తుంది’ అన్నారు.