SarkaruVaari Paata Trailer: అందం మెయింటైన్ చేయలేక దూల తీరిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు సర్కారువారి పాట ట్రైలర్ రిలీజ్ అవుతుందా..? వింటేజ్ మహేష్ ను ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేసిన అభిమానులకు ఈ ట్రైలర్ పండగను తెచ్చిపెట్టింది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముందు నుంచి చెప్తున్నట్లే మహేష్ ఊర మాస్ స్వాగ్ ని దింపేశారు. ” నా ప్రేమను దొంగలించగలవు, నా స్నేహాన్ని దొంగలించగలవు, నా మనీని మాత్రం దొంగలించలేవు అంటూ మహేష్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమై ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విదేశాల్లో వడ్డీ వ్యాపారం చేస్తున్న మహేష్ .. తన దగ్గర తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోతే ఊరుకోడు. తన డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు . ఇక అక్కడే చదువుకుంటున్న కళావతి మాస్టర్స్ ఫినిష్ చేయడానికి మహేష్ దగ్గర అప్పు చేస్తోంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇలా సాగుతున్న క్రమంలో తన వద్ద అప్పుచేసి, తిరిగి చెల్లించని విలన్ కోసం మహేష్ ఇండియాకు వస్తాడు. అక్కడ విలన్ కు, హీరోకు మధ్య జరిగిన గొడవ ఎక్కడికి దారి తీసింది. అస్సలు మహేష్ ఎందుకు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.. ? చివరికి విలన్ దగ్గర నుంచి అప్పును వసూలు చేశాడా..? లేదా ? అనేది కథగా తెలుస్తోంది.
ఇక సినిమా మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో అని ట్రైలర్ ని బట్టి అర్ధం అవుతుంది. ప్రతి సీన్ లో మాస్ ఎలిమెంట్స్ ను పుష్కలంగా దట్టించేశారు. ఇక మహేష్ కామెడీ టైమింగ్, అందులోను పక్కన వెన్నెల కిషోర్ తో అంటే దూకుడు గుర్తుకువస్తుంది. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది మహేష్ లుక్ గురించి, ఎంతో హ్యాండ్సమ్ గా, చార్మింగ్ గా కనిపించాడు. ప్రతి ఫ్రేమ్ లోను మహేష్ తప్ప పక్కన వున్నవారు కనిపించడంలేదు అంటే అతిశయోక్తి కాదు. కీర్తి లుక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో బోల్డ్ డైలాగ్ తో మహేష్ కేక పెట్టించేశాడు. థమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు. మొత్తానికి ట్రైలర్ మాస్ స్వాగ్ తో అల్టిమేట్ గా ఉందని చెప్పాలి. దర్శకుడు పరుశురామ్ పడిన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. మరి ఈ సినిమా మే 12 న ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?