మరో వారం రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో టాలీవుడ్‌లో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 24 గంటల్లో 27 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది సర్కారు వారి పాట ట్రైలర్. ఇక తాజాగా ఈ సినిమా యూఎస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతుంది. ఎన్నడు లేని విధంగా యూఎస్‌లో రికార్డు స్థాయిలో 603 లోకేషన్స్‌లో విడుదల చేయబోతున్నారు. ప్యాన్ ఇండియా సినిమాలు తప్పితే.. ఓ తెలుగు సినిమా ఈ రేంజ్‌లో.. ఇన్ని లోకేషన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. మహేష్ బాబు కెరీర్లోనే నెవర్ బిఫోర్ రిలీజ్‌గా.. సర్కారు వారి పాట నిలవబోతోంది. దాంతో ఈ సారి ఒవర్సీస్‌లో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమంటున్నారు.
ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అక్కడ మే 11న ఈ సినిమా ప్రిమియర్స్ వేయబోతున్నారు. ఇక సర్కారు వారి పాట రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే దర్శకుడు పరుశురామ్, హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా పై అంచనాలను పెంచేశారు. అలాగే ఈ నెల 7న భారీ ఎత్తున్న ప్రి రిలీజ్ బిజినెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు గెస్ట్‌గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సర్కారు వారి పాట సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌కు విశేష స్పందన వస్తోంది. దాంతో త్వరలోనే మరో మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెబుతున్నారు. దాంతో సర్కారు వారి పాటపై అంచనాలు మిన్నంటాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఆ తర్వాత రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు మహేష్ బాబు.