Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Sarkaru Vaari Paata May Month Biggest Record

Progress report: మే నెల ‘సర్కారు వారి’దే!

Published Date :May 30, 2022 , 12:05 pm
By Subbarao N
Progress report: మే నెల ‘సర్కారు వారి’దే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

గడిచిన నాలుగు నెలలతో పోల్చితే మే లో తక్కువ సినిమాలు విడుదలయ్యాయి. స్ట్రయిట్, డబ్బింగ్, ఓటీటీ సినిమాలతో కలిపి కేవలం 17 చిత్రాలే జనం ముందుకు వచ్చాయి. విశేషం ఏమంటే పలు చిన్న సినిమాల నడుమ ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్‌ 3′ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక వీక్ వైజ్ గా చూసుకుంటే మే 6వ తేదీ ఏకంగా ఏడు సినిమాలు ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో సందడి చేశాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత సుమ కీలక పాత్ర పోషించిన’జయమ్మ పంచాయితీ’ మే 6న విడుదలైంది. భిన్నమైన కథను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడనే ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా జయమ్మ విజయం సాధించలేకపోయింది. అదే అనుభవం విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’కూ లభించింది. అతని గత చిత్రం ‘పాగల్’తో పోల్చితే ఇది బెటర్ మూవీ అన్నారు. కానీ వినోదాన్ని పంచడంలో విశ్వక్ సేన్ ఫెయిల్ అయ్యాడు. వైవిధ్యమైన కథతో జనం ముందుకు వచ్చే శ్రీవిష్ణు సైతం ‘భళా తందనాన’తో మెప్పించలేకపోయాడు. ఈ వారం విడుదలైన వాటిలో ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ మల్టీపేర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ ఫర్వాలేదనిపించింది. ఇక ఓటీటీలో వచ్చిన ‘దొంగాట, చిన్ని, ద కశ్మీర్ ఫైల్స్’ పెద్దంత మెప్పించలేదు. అవార్డ్ విన్నింగ్ మూవీ ‘దొంగాట’ విమర్శకులకు నచ్చింది. ‘చిన్ని’ చిత్రంలో కీర్తి సురేశ్ నటన ప్రశంసించదగ్గదిగా ఉంది. ఇక థియేటర్లలో వేవ్స్ సృష్టించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

మే నెల సెకండ్ వీకెండ్ లో 12వ తేదీ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ విడుదల కాగా, ఆ మర్నాడు శివ కార్తికేయన్ ‘డాన్’ రిలీజైంది. మహేశ్, కీర్తి సురేశ్ జంటగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ స్థాయిలో సినిమా లేదన్నది విమర్శకుల మాట. అయినా తమ సినిమాకు వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించటం విశేషం. ఈ యేడాది విడుదలైన తెలుగు చిత్రాలలో కలెక్షన్ల పరంగా తమదే అగ్రస్థానంగా డిక్లేర్ చేసింది సర్కారు యూనిట్. ఇక ‘డాన్’ గా వచ్సిన శివకార్తికేయన్ ఓ వర్గం ప్రేక్షకులనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వారం రాజశేఖర్ ‘శేఖర్’, బండ్ల గణేశ్‌ ‘డేగల బాబ్జీ’, సంపూర్ణేశ్‌ బాబు ‘థగడ్ సాంబ’, ‘ధ్వని’, అనువాద చిత్రం ‘ది మిస్టరీ ఆఫ్ ది డ్రాగన్‌ సీల్‌’ విడుదలయ్యాయి. ఇందులో ‘శేఖర్’ మలయాళ రీమేక్ కాగా, ‘డేగల బాబ్జీ’ తమిళ రీమేక్. వీటితో పాటు ఏ సినిమాకూడా ప్రజాదరణ పొందలేదు.

ఇక మే నాలుగోవారంలో జనం ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఎఫ్ 3’ వచ్చింది. వెంకటేశ్‌, వరుణ్ తేజ్ కాంబోలో గతంలో విడుదలై విజయం సాధించిన ‘ఎఫ్ 2’ తర్వాత అదే ఫ్రాంచైజ్ లో వచ్చిన చిత్రం కావడంతో దీనిపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫన్ కంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అని వినిపిస్తున్నా చిత్ర బృందం థియేటర్ల చుట్టేస్తూ సక్సెస్ కోసం తాపత్రయపడుతోంది. మే 27న విడుదలైన ‘టాప్ గన్ మేవరిక్’ కు బాగా ఉందనే టాక్ వచ్చినా కలెకన్లు నిల్. ఇక 28న విడుదలై ఆది సాయికుమార్ ‘బ్లాక్’ చూసిన వారైతే మైండ్ బ్లాంక్ అయిపోయిందని వాపోతున్నారు. ఈ వారంతంలో ఆహాలో స్ట్రీమింగ్ అయిన తమిళ అనువాద చిత్రం ‘రైటర్’కూ పెద్దంత గుర్తింపు రాలేదు. మొత్తం మీద వసూళ్ళ విషయంలో క్లారిటీ లేకున్నా… మే నెల మాత్రం ‘సర్కారు వారి’దే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • keerthy suresh
  • Latest Movie Updates
  • mahesh babu
  • Mythri Movie Makers
  • Parasuram

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions