సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనుకుంటున్నట్టుగానే తాజాగా “సర్కారు వారి పాట” నుంచి అప్డేట్ వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ “సర్కారు వారి పాట” చిత్రం నుండి మొదటి పాటను ప్రేమికుల రోజున విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా థమన్ పోస్టర్ తో అప్డేట్ ను విడుదల చేశారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో సూపర్‌స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Read Also : బ్రేకింగ్ : మెగాస్టార్ కు కరోనా పాజిటివ్
మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాట మంది మెలోడీగా ఉండబోతోంది. అయితే గాయకులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 1న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.