Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటిస్తున్న చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్స్,పాటలు కూడా సినిమా పైన అంచనాలు పెంచేశాయి. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read: Divya Bharathi: అప్సరసలా కవ్విస్తున్న అందాల దివ్య భారతి
యాక్షన్ ఎంటర్టైనెర్ గ వస్తున్న ఈ సినిమాలో ఎస్ జె. సూర్య, సాయికుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ ను ప్రకటించారు. అది ఏమిటి అంటే పరుగులు తియ్యండి హీరో వస్తున్నాడు అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. .ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్ కొట్టిన నాని మరి ఈ మూవీతో హ్యాట్రిక్ కొడతాడేమో చూడలిసిందే…
The time has come for the REAL MADNESS to begin 🤙🏽🤙🏽
‘𝐑𝐔𝐍’ – 𝐇𝐞 𝐢𝐬 𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐨𝐧 𝐉𝐮𝐥𝐲 𝟐𝟎𝐭𝐡 🔥#SaripodhaaSanivaaram#SuryasSaturday
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@muraligdop @karthikaSriniva @SVR4446… pic.twitter.com/66VcBljafG
— DVV Entertainment (@DVVMovies) July 17, 2024