Sarath Babu Birthday Special : వైవిధ్యంతోనే శరత్ బాబు పయనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarath Babu Birthday Special : శరత్ బాబు ఎంతటి విలక్షణమైన నటుడో ఆయన పాత చిత్రాలను చూస్తే తెలుస్తుంది. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ శరత్ బాబు అభినయం అలరించింది. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో ఓ అతిథి పాత్రలో కనిపించారు శరత్ బాబు. వందలాది చిత్రాలలో విభిన్నపాత్రలతో ఆకట్టుకున్న శరత్ బాబు, ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపిస్తున్నారు.
శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు. శరత్ బాబు తండ్రికి పెద్ద హోటల్ ఉండేది. తన తదనంతరం తనయుడు హోటల్ చూసుకుంటాడని భావించారు ఆ తండ్రి. అయితే శరత్ బాబుకు మాత్రం తాను పోలీస్ ఆఫీసర్ కావాలనే అభిలాష ఉండేది. ఆ సమయంలో మిత్రులు, లెక్చరర్స్ ‘హీరోలా ఉంటావ్ … సినిమాల్లో ట్రై చేయరాదూ…’ అన్నారు. ఆ మాటలు శరత్ బాబు తల్లిని ఆకట్టుకున్నాయి. తండ్రి అంగీకరించక పోయినా, తల్లి ప్రోత్సాహంతో మద్రాసు చేరి, అవకాశాలవేట ప్రారంభించారు శరత్ బాబు. ఆ సమయంలో ‘రామవిజేత’ సంస్థ నూతననటీనటులు కావాలంటూ ఓ ప్రకటన వేసింది. దానిని పట్టుకు వెళ్ళిన శరత్ బాబుకు హీరోగానే అవకాశం లభించింది. అలా శరత్ తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘రామరాజ్యం’. ఆ సినిమాతోనే పేరు మార్చారు. అప్పటికే ఎంతో పేరున్న చంద్రకళ ఇందులో నాయిక. ఈ సినిమాలో శరత్ తో చంద్రకళపై చిత్రీకరించిన ‘ఏమండీ లేతబుగ్గల లాయరు గారూ…’ పాట అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
Also Read
- Peddi : ముంబైలో 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
- Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
- Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్'తో లవ్ రూమర్స్'పై త్రిష రియాక్షన్!
- Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
‘రామరాజ్యం’ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో శరత్ బాబు దొరికిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేశారు. ‘బంగారు మనిషి, అమెరికా అమ్మాయి, దొరలు-దొంగలు’ వంటి చిత్రాలలో నటించారు. అప్పటికే కమెడియన్ గా స్టార్ స్టేటస్ లో ఉన్న రమాప్రభతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రణయంగా మారడం, తరువాత వారి పరిణయం కావడం జరిగిపోయాయి. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. పద్నాలుగేళ్ళ పాటు వారి కాపురం సవ్యంగా సాగింది. అప్పటికే శరత్ బాబు కూడా తెలుగు, తమిళ చిత్రాలలో బిజీ యాక్టర్ అయిపోయారు. కె.బాలచందర్ తెరకెక్కించిన ‘నిళల్ నిజమాగిరదు’ చిత్రంతో తమిళనాట శరత్ కు మంచి పేరు లభించింది. అదే సినిమాను తెలుగులో ‘ఇది కథకాదు’గా తెరకెక్కించగా, తెలుగులోనూ శరత్ నటించారు. ఈ సినిమాలతో శరత్ కేరెక్టర్ యాక్టర్ గా మంచి పేరు సంపాదించుకొని, సక్సెస్ రూటులో సాగిపోయారు. తరువాత రమాప్రభ, శరత్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి విడిపోయారు. ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను పెళ్ళాడారు శరత్. ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు ప్రాణం పోయాలని తపిస్తూనే ఉన్నారు శరత్ బాబు.
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?