గత కొంత కాలంగా బాలీవుడ్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కన్ను ఉంది. తన మన అనే బేధం లేకుండా టాప్ స్టార్స్ నుంచి సామాన్యుల వరకూ డ్రగ్స్ ఇష్యూ బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇటీవల సంఘటనలతో ఉన్నత స్థాయి బాలీవుడ్ ప్రముఖులలో మరీ ముఖ్యంగా యువ తరం నటీనటుల్లో ఎంతో భయం నెలకొనిఉంది. ఇక ఇదిలా ఉంటే మన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శుక్రవారం 57వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ యంగ్ లేడీ సారా అలీ ఖాన్ ట్విట్టర్లో అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అదే ఆమె ట్రోల్స్ బారిన పడటానికి కారణమైంది. నెటిజన్లు ఆమెను తమ ట్రోల్స్ లో ఆడుకున్నారు.
Read Also : ‘కిలిమంజారో’పై నివేదా థామస్
‘థాంక్యూ నామ్ హట్ జాయేగా లిస్ట్ సే’ అని ఓ యూజర్ ట్వీట్ చేయగా… జర్నలిస్ట్ మనీషా పాండే ‘ఎవరు ఈ ఖాతా నడుపుతున్నారు. బ్లూ టిక్ ఎందుకు ఉంది’ అని ట్వీటారు. ‘ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మిమ్మల్ని సురక్షితంగా గుర్తుంచుకోవడానికి ఇది కొత్త మార్గమా?’ అని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అలీఖాన్ మహమూదాబాద్ ట్వీట్ చేశారు. మరి కొందరు కూడా సారాని తమ ట్వీట్స్ తో ఆట పట్టించారు. పుట్టిన రోజు విషెస్ చెప్పినంత మాత్రానా సెలబ్రెటీలను ఇంత నిర్దాక్షిణ్యంగా టార్గెట్ చేయాలా అని కొందరు బాలీవుడ్ ప్రముఖులు వాపోతున్నారు. ఏదేమైనా సెలబ్రెటీలు కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మంచిదనే వారూ లేకపోలేదు. అయినా జనంలోకి వెళ్ళాక ఇలాంటివి ఫేస్ చేయక తప్పదు.