బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హవా నడుస్తోంది. ఇప్పుడు బీటౌన్ లో స్టార్ హీరోయిన్లుగా దూసుకెళ్తున్న కొందరు నటీమణులు మన బీస్ట్ తో జత కట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ రౌడీ హీరోతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ కు తోడుగా సారా అలీ ఖాన్ కూడా తాను విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ మరోసారి చెప్పుకొచ్చింది.
Read Also : ఫ్యామిలీతో మహేష్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్… పిక్ వైరల్
సారా అలీ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘అత్రంగి రే’కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దీంతో సారాకు 2021 సంవత్సరం సందడితో ముగిసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో సారా మాట్లాడుతూ… కరణ్ జోహార్ మళ్లీ ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా చేస్తే… విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్‌లతో కలిసి అందులో భాగం కావడానికి ఇష్టపడతానని సారా వెల్లడించింది. విజయ్ దేవరకొండ, జాన్వీలతో తను చేయడానికి ఇష్టపడే ఒక సినిమా పేరు చెప్పమని సారాను అడిగారు. దీనికి సారా బదులిస్తూ “కరణ్ జోహార్, విజయ్ దేవరకొండతో ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా చేస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. వాళ్లకు ఇప్పుడే ఫోన్ చేయాలనీ అనుకుంటున్నా. అంతేకాదు వారు అంగీకరిస్తారని దాదాపు 98.3 శాతం నమ్మకం ఉంది” అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది.
సారా విజయ్ దేవరకొండతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు ఇంతకుముందు కూడా చెప్పింది. ఆమె ముంబైలో ‘లైగర్’ స్టార్‌ను కలిసినప్పుడు ఒక సెల్ఫీని క్లిక్ చేసి దానిని తన ‘ఫ్యాన్ మూమెంట్’ అని చెప్పడం విశేషం. విజయ్ దేవరకొండ ‘కూల్’, ‘హాట్’ అంటూ కామెంట్స్ చేసింది.