Santhosh Shobhan: టాలీవుడ్ లో ప్రామిసింగ్ కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సంతోష శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ప్రభాస్ గురించి టాలీవుడ్ లో అందరికి తెలుసు. తన ద్వారా చిన్న సినిమాలు, కుర్ర హీరోలు పైకి వస్తారు అని తెలిస్తే తనవంతు సాయం చేయడానికి ఎప్పుడు డార్లింగ్ ముందు ఉంటాడు. సంతోష శోభన్ నటించిన ప్రతి సినిమాలో ఏదైనా ఒకటి ప్రభాస్ చేతుల మీద రిలీజ్ అవుతోంది.
ప్రభాస్ కు వర్షం సినిమాతో మొదటి హిట్ ను ఇచ్చింది శోభన్. సంతోష్ వాళ్ల నాన్న. ఆ అభిమానంతోనే ప్రభాస్, సంతోష్ ను తమ్ముడిలా చూస్తాడు. ఏ హెల్ప్ కావాలన్నా ముందు ఉంటాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్- సంతోష్ రిలేషన్ పై ఒక రిపోర్టర్ ఎగతాళిగా మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్.. ప్రభాస్ తో అగ్రిమెంట్ ఇంకా ఎన్నాళ్లు ఉంది అంటూ వెటకారంగా అడిగాడు.. దానికి సంతోష్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ” నా జీవితం మొత్తం ప్రభాస్ తో అగ్రిమెంట్ ఉంది. నా జీవితం మొత్తం ఆయనకు నేను అభిమానిగానే ఉంటాను. అతనిని నేనెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను”అని చెప్పుకొచ్చాడు.ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక రిపోర్టర్ అయ్యి ఉండి అలాంటి ప్రశ్నలు అడగడానికి కొంచమైనా బుద్ది లేదా.. అగ్రిమెంట్లు చేసుకొని, డబ్బులు ఇచ్చి ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ లు ప్రభాస్ రిలీజ్ చేస్తున్నాడా..? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.