సంక్రాంతి వార్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి వార్ గట్టిగానే ఉండబోతోంది. తెలుగు చిత్రసీమలో ఉన్న పెద్ద హీరోలంతా పొంగల్ బరిలోకి దిగేశారు. ఈసారి జనవరిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు ఉన్నాయి. మహేష్ బాబు చిత్రం “సర్కారు వారి పాట”ను కూడా ముందుగా సంక్రాంతికే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ తరువాత నిర్ణయం మార్చుకున్న మేకర్స్ సినిమా విడుదల తేదీని మార్చేశారు. ఇప్పుడు మిగిలిన మూడు సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగనుంది. మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడంతో ఈ సంక్రాంతి అటు ప్రేక్షకులతో పాటు నిర్మాతలకు కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ను వాయిదా వేయాలంటూ నిర్మాత నాగ వంశీకి సినిమా వర్గాల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా నిన్న ‘భీమ్లా నాయక్’కు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ మరోమారు కన్ఫర్మ్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ‘భీమ్లా నాయక్’ జనవరి 12న విడుదలకు సిద్ధం అవుతుండగా, ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు బుక్ చేసుకున్నారు.

Read Also : కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !

అయితే ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలూ బాక్స్ ఆఫీస్ ఫైట్ కు దిగడం అనేది అంత మంచి విషయం కాదు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అలాగే సినిమా సినిమాకూ కనీసం వారం అన్నా గ్యాప్ ఉంటే ఏ సినిమా నిర్మాతలూ నష్టపోకుండా ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న సమస్యాత్మక పరిణామాలను పరిగణలోకి తీసుకుని, వాటిని పరిష్కరించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగింది. 2022 పొంగల్‌ సినిమాల విడుదలకు సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం నిర్మాతల సంఘం ఈరోజు సమావేశానికి ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సమావేశంలో ఒక సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి.

Related Articles

Latest Articles