తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సంక్రాంతి సీజన్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకేసారి ఐదు పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో పాటు సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. దీంతో థియేటర్ల దగ్గర సందడి ఎంత ఉందో, స్క్రీన్ల కేటాయింపు విషయంలో ఎగ్జిబిటర్లకు అంతటి పరీక్ష ఎదురవుతోంది. ముందుగా వచ్చిన ప్రభాస్ “ది రాజా సాబ్”, చిరంజీవి “మన శంకరవర ప్రసాద్ గారు”, రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, నవీన్ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు”, శర్వానంద్ “నారీ నారీ నడుమ మురారి” ఇలా అందరూ స్టార్ హీరోలే పోటీ పడుతుండటంతో ఏ సినిమాలకు ఎన్ని షోలు వేయాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సినిమా భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుండగా, అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎక్కువ శాతం స్క్రీన్లు ఈ చిత్రానికే కేటాయించాల్సి వస్తోంది.
Also Read : Mana Shankara Varaprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ రికార్డు.. 3 రోజు కలెక్షన్స్ ఎంత అంటే ?
మరోవైపు నవీన్ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు”.. శర్వానంద్ “నారీ నారీ నడుమ మురారి” సినిమాలకు కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, స్క్రీన్లు దొరకక ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ప్రభాస్ సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాకపోవడంతో చేసేదేం లేక ఆ థియేటర్లను కొత్తగా వచ్చిన చిన్న సినిమాలకు మళ్ళించే ప్రయత్నం జరుగుతోంది. రవితేజ సినిమా కూడా డీసెంట్ వసూళ్లతో నిలకడగా సాగుతోంది. కానీ ప్రతి సినిమాకూ ప్రేక్షకుల ఆదరణ ఉండటంతో, డిమాండ్‌కు తగ్గట్టుగా షోలు పెంచడం ఎగ్జిబిటర్లకు సాధ్యం కావడం లేదు. చాలా చోట్ల తెల్లవారుజామున 4 గంటలకే షోలు వేస్తున్నా టికెట్ల దొరకని పరిస్థితి నెలకొంది. ఈ సంక్రాంతి విన్నర్‌ను తేల్చడంతో పాటు, ఈ ఐదు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షోలు సర్దుబాటు చేయడం రాబోయే రెండు మూడు రోజులు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్‌గా మారనుంది.