సంక్రాంతి సీజన్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కడా లేని జోష్ వస్తుంది. లాంగ్ లీవ్స్, ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండడం కలెక్షన్స్ కి మంచి బూస్ట్ ఇస్తాయి. ఈ సీజన్ లో ఒక యావరేజ్ సినిమా పడినా కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజులో ఉంటాయి. అందుకే సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. 2024 సంక్రాంతి సీజన్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ వచ్చాయి అంటే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే వచ్చే సంక్రాంతికి కూడా భారీ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజులో చేస్తున్న మొదటి సినిమా ప్రాజెక్ట్ కల్కిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.
పాన్ ఇండియా సినిమా హనుమాన్ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా డిలే అవుతూ ఉంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న రవితేజ కూడా సంక్రాంతి ఈగల్ మూవీని రిలీజ్ చేయనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. దీంతో పాటు ఎట్టి పరిస్థితిలో హనుమాన్ ని సంక్రాంతి బరిలో నిలపాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న గౌతమ్ తిన్నునూరి స్పై థ్రిల్లర్ కూడా సంక్రాంతికి రిలీజ్ అవనుంది. ఈ మూవీ గురించి ఖుషి రిలీజ్ అయ్యాకే అప్డేట్స్ బయటకి రానున్నాయి.
ఇక రీజనల్ సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తుంది. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ అవుతుందని ఇప్పటికే మహేష్ బాబు క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సంక్రాంతి సినిమాల లిస్టులో జాయిన్ అయ్యింది కింగ్ నాగార్జున నటిస్తున్న నా సామీ రంగ సినిమా. లేటెస్ట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలపాలి అనేది నాగార్జున ప్లాన్. ఇది వర్కౌట్ అయితే ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ సినిమాలతో ప్యాక్ అయి ఉన్న సంక్రాంతి సీజన్ ని నాగార్జున మరింత లాక్ చేస్తున్నట్లే. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ సంక్రాంతికే రిలీజ్ అవుతాయా? లేక ఏమైనా వాయిదా పడతాయా అనేది చూడాలి.