Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sankranthi Big Films Face Legal Trouble In Telangana Over Ticket Prices

Sankranthi: రేపటి తీర్పుపై ప్రభాస్, చిరు సినిమాల భవితవ్యం.. టికెట్ రేట్లపై ఉత్కంఠ!

Published Date :January 6, 2026 , 9:24 pm
By Bhargav Chaganti
Sankranthi: రేపటి తీర్పుపై ప్రభాస్, చిరు సినిమాల భవితవ్యం.. టికెట్ రేట్లపై ఉత్కంఠ!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సంక్రాంతి బరిలో నిలిచిన భారీ చిత్రాలకు తెలంగాణాలో ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోల వ్యవహారం ఇప్పుడు హైకోర్టు గడప తొక్కింది. సంక్రాంతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇరు చిత్రాల నిర్మాతలు డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు. గత విచారణలో సింగిల్ బెంచ్ జడ్జి టికెట్ ధరలను పెంచడానికి, ప్రత్యేక షోలను నిర్వహించడానికి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్‌ను నిర్మాతలు ఆశ్రయించారు.

Also Read:Ayalaan Telugu OTT Release: థియేటర్ కన్న ముందే ఓటీటీకి రాబోతున్న తమిళ స్టార్ హీరో..

Also Read

  • Rajinikanth : ఆర్‌బీ చౌదరి మరణంపై రజనీకాంత్ ఎమోషనల్..
  • Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
  • Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
Add as a preferred
source on google

తమ చిత్రాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున, ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా అందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, ఈ కేసులను రేపు విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ఇక రేపు హైకోర్టులో జరిగే విచారణపైనే ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ భవితవ్యం ఆధారపడి ఉంది ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పండుగ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులకే మొగ్గు చూపితే మాత్రం నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రేపటి విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi Venkatesh film news
  • Mana Shankara Vara Prasad Garu ticket rates
  • Prabhas movie ticket controversy
  • Sankranthi Telugu movies legal issue
  • Telangana additional shows permission

తాజావార్తలు

  • Rajinikanth : ఆర్‌బీ చౌదరి మరణంపై రజనీకాంత్ ఎమోషనల్..

  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

  • IPL 2026-BCCI: ఐపీఎల్‌లో సంచలనం.. క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానాలు.. సమాచార లీక్‌పై బీసీసీఐ సీరియస్!

  • Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్‌లు ఇవే!

  • Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions