Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాలీ భామ త్రిధా చౌదరి తెలుగులో ‘సూర్య వర్సెస్ సూర్య’తో పాటు ‘మనసుకు నచ్చింది’, ‘అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి’ లాంటి సినిమాల్లో కనిపించింది. కానీ, ఓటీటీ కోసం చేసిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
అయితే, ఈ సిరీస్ షూటింగ్ టైమ్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేస్తున్న సమయంలో తన పర్సనల్ లైఫ్ పూర్తిగా నాశనమైందని, యాంగ్జైటీ కారణంగా ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారేదని చెప్పుకొచ్చింది. “నేను ఎవరితోనైనా మాట్లాడినా, ఏదైనా చేసినా ఎవరో ఒకరు వచ్చి నన్ను చుట్టుముట్టేస్తున్నట్లు, నాకేదో జరిగిపోతున్నట్లు భయపడేదాన్ని.” ఆ భయం కారణంగా షూటింగ్ సమయంలో చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యానని ఆమె గుర్తు చేసుకుంది.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
కరోనా సమయంలో ఒక గదికే పరిమితమైపోయానని, మానసికంగా ఒక చీకటి గదిలో బందీ అయినట్లు ఫీలింగ్ వచ్చేదని చెప్పుకొచ్చింది. తన టాక్సిక్ రిలేషన్ కారణంగా ఎవరినీ కలవలేక, ఎవరితోనూ మాట్లాడలేని దారుణమైన స్థితికి వచ్చానని, ఆఖరికి తన తండ్రితో కూడా మాట్లాడడం కుదరలేదని చెప్పుకొచ్చింది. చివరకు, తన స్నేహితుడి ఓదార్పు, అతను ఇచ్చిన ధైర్యం కారణంగానే ఈ పరిస్థితులను దాటి బయటకు వచ్చినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!