Sanjana Galrani : సంజనా గల్రానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొని సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఆటకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఆమె గంతలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ… నేను కన్నడ ఇండస్ట్రీలో ఓ హీరో వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అతను నన్ను టార్చర్ చేశాడు. ఆ హీరో పేరు నేను బయటకు చెప్పను. ఓ సినిమా షూటింగ్ లో మా ఇద్దరికీ గొడవ అయింది.
Read Also : Heroins : సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లిన హీరోయిన్లు వీరే..
అది అతను మనసులో పెట్టుకున్నాడు. ఓ యాక్షన్ సీన్ లో అతను నా చేతులు పట్టుకుని ముందుకు వెళ్లాలి. కానీ అతను నా చేతులు బలంగా నొక్కి పట్టుకున్నాడు. చాలా నొప్పిగా అనిపించింది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా.. ఇలాగే చేయాలి అంటూ సైగలు చేశాడు. నా వల్ల కాలేదు. అందుకే షూటింగ్ కొంతసేపు ఆపేశాను. ఇలా అయితే నేను చేయను అని వారించుకుని కూర్చున్నాను. కొద్ది సేపటి తర్వాత మళ్లీ షూటింగ్ చేశాం. ఇబ్బంది పడుతూనే ఆ సినిమాను కంప్లీట్ చేశా అని తెలిపింది హీరోయిన్.
Read Also : Bhatti Vikramarka : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ప్రశ్నించొద్దు
