Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!

Prabhas Spiri Sandeep Reddy Vanga

Prabhas Spiri Sandeep Reddy Vanga

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏది మాట్లాడినా సంచలనమే. భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్.. తాజాగా నిర్మాతగా మారి ఓ వైవిధ్యమైన కామెడీ సినిమా రోమాంచకంను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సందీప్.. రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’కి సంబంధించి మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్స్ ఇచ్చారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ప్రభాస్‌కు ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని సందీప్ ట్యాగ్ ఇవ్వడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సందీప్ వంగా బదులిస్తూ.. “ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అనేది కేవలం మా ఫీలింగ్ మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానుల ఫీలింగ్. ఆయన రేంజ్ కు తగ్గట్టుగానే ‘స్పిరిట్’ సినిమాతో ఒక సరికొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేస్తామన్న నమ్మకం మాకుంది” అని ధీమా వ్యక్తం చేశారు.