యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఆల్బమ్‌లోని ఆడియో సింగిల్స్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ చిత్రంలోని “సంచారి” అనే సాంగ్ టీజర్ ను ఇటీవల విడుదల చేసి ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసిన ‘రాధేశ్యామ్’ టీం ఇప్పుడు 5 భాషల్లో పూర్తి సాంగ్ యూ విడుదల చేసింది.
Read also : అర్జునుడు సమరానికి సిద్ధం !
తాజాగా విడుదలైన ఈ కొత్త వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌ను ఎలా ఉంటుందో సాంగ్ ద్వారా చూపించారు. ప్రభాస్ ప్రయాణం మరియు సాహసాలను ఇష్టపడే వ్యక్తి అని ఈ పాట స్పష్టంగా సూచిస్తుంది. ఈ పాటలో యూరప్‌లోని వివిధ సుందరమైన ప్రదేశాలకు ప్రభాస్ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాడు. తెలుగులో ఈ పాటకు లిరిక్స్ కృష్ణ కాంత్, సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించగా, అనిరుధ్ పాడారు. “రాధే శ్యామ్” 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.