Samyuktha learns horse riding for Swayambhu film: సంయుక్త మీనన్ తెలుగులోకి భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత ఆమె చేసిన బింబిసార, సార్, విరూపాక్ష లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్వయంభు అనే సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు సంయుక్త మీనన్ చేసిన సినిమాలన్నీ లోకల్ సినిమాలు కాగా ఇది మొదటి ప్యాన్ ఇండియా సినిమా. ఇక ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకోవడమే కాదు చాలా కష్ట పడుతోంది.
Vyooham : ‘వ్యూహం’ రిలీజ్ డేట్ కు చంద్రబాబుకు ఉన్న లింక్ ఇదే.. ఆర్జీవీ పోస్ట్ వైరల్
తాజాగా ఆమె హార్స్ రైడింగ్ చేస్తున్న ఒక ఫోటోని షేర్ చేసింది. షేర్ చేయడమే కాదు దానికి సంబంధించిన ఒక నోట్ కూడా రాసుకొచ్చింది. తాను స్వయంభు సినిమా షూటింగ్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాను అని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇలా హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి రావడం తనకు చాలా గొప్పగా అనిపిస్తోందని గుర్రాలతో ఒక మంచి కనెక్షన్ కూడా ఏర్పడినట్లు అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ఈ 2024 తన జీవితంలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను ఎప్పుడూ కంఫర్టబుల్ గా ఉండడానికి ఇష్టపడనని ఒళ్ళు వంచి కష్ట పడడానికే ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చింది.