యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ యాసలో మాట్లాడుతూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న కిరణ్ సబ్బవరం, రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ‘రూల్స్ రంజన్’ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం’ నటిస్తున్నాడు. ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేసిన కిరణ్ అబ్బవరం, మొదటిసారి కాస్త క్లాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఉన్నాడు. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా కిరణ్ అబ్బవరం చాలా కూల్ లుక్ లో కనిపించాడు.
అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘సమ్మోహనుడా’ అనే సాంగ్ జులై 20న ఉదయం 9:30కి రిలీజ్ అవ్వనుంది. ఈ లోపు మేకర్స్ నుంచి సమ్మోహనుడా సాంగ్ ప్రోమో బయటకి వచ్చింది. రూల్స్ రంజన్ ని కూల్ చేసే పనిలో ఉన్న రాధికా, హాట్ డాన్స్ తో ఇంప్రెస్ చేస్తుంది. “సమ్మోహనుడా పెదవే ఇస్తా కొంచెం కొరుక్కోవా… ఇష్టసఖుడా నడుమే ఇస్తా నలుగే పెట్టుకోవా” అంటూ శ్రేయ ఘోషల్ వాయిస్ లో లిరిక్స్ వినిపిస్తుంటే, నేహా శెట్టి గ్లామర్ ట్రీట్ ఇస్తూ సాంగ్ ని చాలా బ్యూటిఫుల్ గా మార్చింది. ప్రోమో సాంగ్ లో హైలైట్ అంటే శ్రేయ ఘోషల్ వాయిస్ అండ్ నేహా శెట్టి డాన్స్ అనే చెప్పాలి. ప్రోమోకే ఇలా ఉంటే ఇక ఫుల్ సాంగ్ కి ఏ రేంజులో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
https://twitter.com/tseriessouth/status/1680794641443217409