టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్… అగ్రస్థానంలో సామ్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021 ఎండింగ్ కు వచ్చేసింది… దీంతో రివైండ్ 2021 అంటూ ఈ ఏడాది జరిగిన అన్ని విషయాలను నెమరేసుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ట్రెండ్ ప్రకారం యూట్యూబ్ వారి వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది 100 పాపులర్ సాంగ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. ‘పుష్ప’ నుంచి ఇటీవల విడుదలైన “ఊ అంటావా ఉఊ అంటావా” సాంగ్ తెలుగు వెర్షన్ ఈ లిస్ట్ లో నెం.1లో నిలిచింది. ‘పుష్ప’ ఆల్బమ్ లోని శ్రీవల్లి సాంగ్ 22వ స్థానంలో, 25వ స్థానంలో ‘సామీ సామి’ (తమిళం), ‘ఊ అంటావా’ (హిందీ) 42వ స్థానంలో నిలిచి సంగీత ప్రియుల ఆదరణ పొందుతోంది. 51వ స్థానంలో ‘సామీ సామీ’ తెలుగు వీడియో సాంగ్, 68వ స్థానంలో ‘సామీ సామి’ తెలుగు లిరికల్ సాంగ్ ఉండడం విశేషం. మొత్తానికి ‘పుష్ప’ పాటలతో ఈ ఏడాది యూట్యూబ్ షేక్ అవుతోంది. ఈ సూపర్ హిట్ ఆల్బమ్‌ను అందించింది దేవిశ్రీ ప్రసాద్ అన్న విషయం తెలిసిందే. ఆయన మ్యూజిక్ అన్ని భాషల ప్రేక్షకులనూ అలరిస్తోంది.
“టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్” ప్లేజాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ‘ఊ అంటావా’ సాంగ్ లో సామ్ మెరిసిన విషయం తెలిసిందే. నిజానికి సామ్ చేసిన మొదటి ఐటెం సాంగ్ ఇదే. ఆమె గ్లామర్ కు, సాంగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాంగ్ లిరిక్స్ వివాదాస్పదమైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!