టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. కొంచెం గ్యాప్ తర్వాత థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సామ్, ‘యశోద’ సినిమాలో వన్ మాన్ షో చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ రావడంతో, ‘యశోద’ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ మార్క్ టచ్ చేసిన ‘యశోద’ బయ్యర్స్ ని సేఫ్ జోన్ లోకి తెచ్చింది. థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టిన ఈ మూవీ ఒటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సమంతా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ‘ఈవ హాస్పిటల్’ యాజమాన్యం ‘యశోద’ సినిమాలో మా హాస్పిటల్ పేరుని తప్పుగా వాడారని కోర్ట్ కి వెళ్లారు. దీంతో ‘యశోద’ సినిమా ఒటీటీ రిలీజ్ కి బ్రేక్ పడినట్లు అయ్యింది.
ఇప్పట్లో ఈ సమస్య తీరదు అనుకుంటున్న సమయంలో ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ ‘ఈవ’ హాస్పిటల్ మానేజ్మెంట్ తో మాట్లాడి సమస్యని పరిష్కరించారు. ఒటీటీలో యశోద సినిమా చూసే వారికి ‘ఈవ’ హాస్పిటల్ పేరు కనిపించకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. డిసెంబర్ 9న యశోద మూవీని ఒటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మిస్టీరియస్ ట్రాప్ ని అన్-రావెల్ చేయండి అంటూ అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. థియేటర్స్ కి యశోద సినిమాని మిస్ అయిన వాళ్లు ఒటీటీలో చూసేయండి. ఆల్రెడీ థియేటర్స్ లో చూసిన వాళ్లు, ఇంకోసారి ఇంట్లో కూర్చోని యశోదని చూసి ఎంజాయ్ చేయండి.
unravel this oh-so-mysterious trap with yashoda 👀#YashodaOnPrime, Dec 9#yashoda #yashodamovie @Samanthaprabhu2 pic.twitter.com/dDDzKsOF4W
— prime video IN (@PrimeVideoIN) December 6, 2022