సమంత రూత్ ప్రభు ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో సెలెబ్రిటీలలో ఒకరు. తాజాగా ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుని మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది సామ్. ఈ స్టార్ బ్యూటీ తొలి ఓటిటి ప్రాజెక్ట్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో నటించి అద్భుతమైన నటనను కనబర్చింది. సంక్లిష్టమైన రాజి పాత్రను పోషించినందుకు సమంతపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా సమంత యాక్షన్ డ్రామా సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″కు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డును గెలుచుకుంది. ఆమె ముంబై వెళ్లి అవార్డుల వేడుకలో కూడా పాల్గొంది. ప్రస్తుతం సామ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Read Also : ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్
కాగా సమంత ఇప్పటి వరకూ సౌత్ లో ‘ఏ మాయ చేసావే’, ‘ఈగ’, ‘నీతానే ఎన్ వసంతం’ చిత్రాలకు ఉత్తమ నటిగా గెలుచుకుంది. ఇప్పుడు నార్త్ లోనూ ఆమె బెస్ట్ యాక్టర్ గా అవార్డును అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన అవార్డుల వేడుకలో సందడి చేసిన సామ్ చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సమంత రెండు ద్విభాషా చిత్రాలను లైన్లో పెట్టింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ ‘యశోద’కు సంబంధించి ఇటీవలే షూటింగ్ ప్రారంభించింది. ఇంకా రాబోయే రోజుల్లో ఆమె హీరోయిన్ గా చేస్తున్న కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు తెరకెక్కబోతున్నాయి.