Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్‌గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న సమంత, ఓటీటీనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఆహా వేదికగా ప్రసారమైన ‘సామ్ జామ్’ టాక్ షోతో హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సమంత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ కోసం తమిళంలో ఓ కొత్త టాక్ షో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన అతిథులతో ఈ షోను రూపొందించే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ వార్తలో మరో ప్రశ్న కూడా వినబడుతోంది. సమంత ప్రస్తుతం గర్భవతిగా ఉండటంతో ఈ టాక్ షో షూటింగ్‌ను ఆమె ప్రెగ్నెన్సీ సమయంలోప్రారంభిస్తారా? లేక ప్రసూతి సెలవు అనంతరం సెట్స్‌పైకి వస్తారా? అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అసలు ఈ టాక్ షోపై సమంత, సోనీ లివ్ నుంచి గాని ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పటికే ‘సామ్ జామ్’ ద్వారా సెలబ్రిటీలతో సమంత హోస్టింగ్ కు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మరో టాక్ షో ప్లాన్ చేస్తున్నారనే వార్త అయితే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ తరువాతే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..