మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది మార్వెల్స్. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే జులై 21న రిలీజైంది. మార్వెల్ మూవీస్ అంటేనే ఫుల్ యాక్షన్, అడ్వెంచర్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు ఈ క్రమంలోనే ది మార్వెల్స్ మూవీ కూడా ఉండేలా కనిపిస్తుంది. మార్వెల్ కు చెందిన ముగ్గురు సూపర్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో భార అంచనాలు ఏర్పడ్డాయి. కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, కెప్టెన్ మోనికా రాంబ్యూలను ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై చూసి థ్రిల్ అవడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని అనడంలో సందేహం లేదు. ది మార్వెల్స్ సినిమాలో బ్రీ లార్సన్, టెయోనా పారిస్, ఇమాన్ వెల్లానీ, శామ్యూల్ జాక్సన్ నటిస్తున్నారు. నియా డకోస్టా డైరెక్ట్ చేస్తుండగా.. కెవిన్ ఫీజ్ నిర్మించిన ది మార్వెల్స్ మూవీ ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం లాంటి భారతీయ భాషల్లో కూడా ఈ ఏడాది దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
Kushi Title Song: ‘ఖుషి’ టైటిల్ సాంగ్ రిలీజ్.. మరో చార్ట్ బస్టర్ ఖాయమే!
అయితే కెప్టెన్ మార్వెల్ కోసం సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ ఎలా అయితే ఒకప్పుడు ప్రమోట్ చేశారో ఇప్పుడు ఆ నలుగురు మరోసారి ప్రమోట్ చేయనున్నారని అంటున్నారు. నిజానికి నాలుగేళ్ల క్రితం ఈ నలుగురూ తమ తమ కెరీర్లో బెస్ట్ స్టేజ్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఐటీ ఆ నలుగురూ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చేసుకున్నారు. తమన్నా భాటియా ఇటీవల చాలా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో కనిపించగా, ఇటీవల తల్లి అయిన కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ సహా సమంత కూడా వరుస ప్రాజెక్టులు ఒప్పుకుని దూసుకుపోతున్నారు. ఇలా వీరంతా కలిసి మరోసారి మార్వెల్ ను ప్రమోట్ చేయనున్నారని అంటున్నారు.