Samantha Take Spiritual Route To Get Rid Off Myositis: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా కండరాల రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో దాని నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక బాట పట్టారు. నిజానికి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు వ్యక్తి కాగా.. తల్లి నినెట్ ప్రభు మలయాళీ. తనకు ఇద్దరు అన్నలు జోనాథన్, డేవిడ్. తమిళనాడులో పుట్టి పెరిగిన సమంత తమిళియన్ అనే చెప్పుకుంటుంది. క్రిస్టియన్‌గా జన్మించినప్పటికీ కొంతకాలంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఫాలోవర్ గా ఉంటోంది. ఇక సమంత ఇటీవల పూర్తి ఆధ్యాత్మికంగా మారిపోయింది. అంతే కాదు జపమాల పట్టుకుని జపం కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండే సమంత తన ఇన్‌స్టాలో జపమాలతో ఉన్న పిక్ షేర్ చేసింది.
IND vs SL ODI Series: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు ఔట్?
ఫిబ్రవరి 17న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఆమె రాబోయే చిత్రం ‘శాకుంతలం’ ప్రచారంలో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది సమంత. చాలా కాలం తర్వాత సమంత పాల్గొన్న పబ్లిక్ ఫంక్షన్ ఇది. ‘శాకుంతలం’ గుణశేఖర్ రచన, దర్శకత్వంతో తెరకెక్కిన పౌరాణిక చిత్రం. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు తో కలసి గుణ టీమ్‌వర్క్స్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఇందులో సమంత టైటిల్ రోల్ శకుంతలగాను, దేవ్ మోహన్ దుష్యంతుడుగా, మోహన్ బాబు దుర్వాసమునిగా నటించగా గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల ఇతర సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. మరి మయోసిటిస్ నుంచి కోలుకుని ‘శాకుంతలం’తో సమంత మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూద్దాం.
KGF 3: హోంబలే తో విభేదాలు.. కెజిఎఫ్ 3 నుంచి యష్ అవుట్..?