లేడీ సూపర్ స్టార్ సమంతా, గుణశేఖర్ డైరెక్షన్ లో నటించిన మూవీ ‘శాకుంతలం’. కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సమంతా ‘శకుంతలా దేవి’గా నటించగా, దేవ్ మోహన్ ‘దుష్యంత మహారాజు’గా నటించాడు. ఈ ఇద్దరికీ పుట్టిన ‘భరతుడి’గా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా నటించింది. ఫాంటసీ డ్రామాగా అనౌన్స్మెంట్ తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన ఈ మూవీ 80 కోట్ల భారి బడ్జట్ తో రూపొందింది. కేవలం సమంతా మాత్రమే సేవియర్ గా, ఆమె మార్కెట్ పైనే డిపెండ్ అయ్యి పాన్ ఇండియా రేంజులో ఏప్రిల్ 14న ఆడియన్స్ ముందుకి వచ్చింది శాకుంతలం సినిమా. హ్యూజ్ థియేట్రికల్ బిజినెస్ సొంతం చేసుకున్న శాకుంతలం సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈవెనింగ్ షోస్ నుంచి థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించడం తగ్గింది. వర్డ్ ఆఫ్ మౌత్ నెగటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో మూడో రోజుకే శాకుంతలం సినిమా బాక్సాఫీస్ రన్ కి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది.
దీంతో సినిమాని కొన్న ప్రతి ఒక్కరికీ భారి నష్టాలని మిగిలించింది శాకుంతలం సినిమా. సమంతా స్టార్ ఇమేజ్ కూడా శాకుంతలం సినిమాని నష్టాల నుంచి బయట పడేయలేకపోయింది. దిల్ రాజు అంతటి స్టార్ ప్రొడ్యూసర్, తన 25 ఏళ్ల కెరీర్ లో శాకుంతలం అంత షాక్ ఇచ్చిన సినిమా ఇంకొకటి లేదని చెప్పాడు అంటే శాకుంతలం సినిమా ఎలాంటి షాకింగ్ రిజల్ట్ ని ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ మండేకే థియేట్రికల్ రన్ ని ఎండ్ కార్డ్ పడడంతో, నెల కూడా తిరగకుండానే శాకుంతలం సినిమా సైలెంట్ గా ఒటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో మల్టిపుల్ లాంగ్వేజస్ లో శాకుంతలం సినిమా స్ట్రీమ్ అవుతోంది. మరి థియేటర్స్ లో మిస్ కొట్టిన ఆడియన్స్ ఒటీటీలో అయినా శాకుంతలం సినిమాని చూస్తారో లేదో చూడాలి.