Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది. ఇక పెళ్ళికి ముందు ఎలా ఉన్నా నాగ చైతన్యతో పెళ్లి అయ్యాక సామ్ డ్రెస్సింగ్ స్టైల్లో మార్పు వచ్చింది. చీరలు, నిండుగా కప్పి ఉంచే దుస్తులనే ధరించేది. ఇక చై తో విడాకుల తరువాత ముద్దుగుమ్మ మళ్లీ పాత స్టైల్లోకి వచ్చేసింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఇక తాజాగా ఈ భామ.. MS గోల్డ్ మాలిక్ మలేషియా యొక్క గ్రాండ్ ఓపెనింగ్‌లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.
ఎరుపు రంగు షిమ్మర్ చీరను ధరించి టోన్డ్ అబ్స్‌ను ప్రదర్శించి సమంత అటెన్షన్ మొత్తం గ్రాబ్ చేసింది. ఇక చీర పైటను పక్కకు నెట్టి ఎద అందాలను ఆరబోసి.. సోషల్ మీడియాలో హీట్ పెంచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సమంతను ఇలా చూసిన అభిమానులు ఫైర్ ఎమోజిస్ ను పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. దీని తరువాత ఇప్పుడిప్పుడే ఆమె కథలను వినడం మొదలుపెట్టిందని టాక్. ఇది కాకుండా సామ్.. ఒక హెల్త్ పాడ్ క్యాస్ట్ ను ప్రారంభించింది. అది కూడా ఆమె దగ్గర ఉండి చూసుకుంటుంది. మరి త్వరలో సామ్ తన కొత్త సినిమాల అప్డేట్స్ ఇస్తుందేమో చూడాలి.