Samantha : “నా లైఫ్‌లో ఉన్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడేం చెప్పలేను.. కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాను”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు.. వ్యక్తిగతంగా ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొని, ఇప్పుడు మళ్లీ తన జీవితాన్ని కొత్తగా మలుచుకుంటోంది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, కెరీర్లో బ్రేక్ ఈ అన్ని దశల తర్వాత సమంత ఇప్పుడు తనను తాను మళ్లీ నిర్మించుకుంటుంది. ఇటీవల ఆమె “Authenticity: The New Fame” అనే టాపిక్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, చేసిన తప్పులు, ఎదుర్కొన్న విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు.
Also Read : Ravi Teja : ట్విటర్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాస్ రాజా..!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
సమంత మాట్లాడుతూ “కెమెరా ముందు జవాబుదారీగా ఉండటం చాలా కష్టం. ఇది ఒక ఫైనల్ డెస్టినేషన్ లాంటిది కాదు, ఇంకా నేర్చుకుంటున్న ప్రయాణం లాంటిది. నా జీవితంలో చాలా విషయాలు సరి చేసుకోవాల్సి ఉంది. వాటిపై మాట్లాడటం కూడా నాకు అవసరం అనిపించింది, నేను పర్ఫెక్ట్ కాదు. నా నిర్ణయాలు తప్పుగా ఉండి ఉండవచ్చు. వాటి ప్రభావం నా జీవితం పై తీవ్రంగా పడింది. కానీ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజంట్ నా జీవితంలో ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పలేను. నాకు తెలిసిన విషయాలను, వాస్తవాలను చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పక మాట్లాడుతాను. నా లైఫ్‌ని దగ్గరగా చూసిన వాళ్లకు, నా పరిస్థితి, నా బాధలు అర్థమవుతాయి” అని ఆమె చెప్పింది. అలాగే,
విడాకుల తర్వాత తనపై సోషల్ మీడియాలో జరిగిన విమర్శలు, ట్రోలింగ్ గురించి కూడా సమంత ఆవేదన వ్యక్తం చేసింది.. “నా డైవోర్స్ విషయాన్ని కొందరు పండుగ చేసుకున్నారు. నాపై అనేక రకాలుగా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో నన్ను ఎంతగా ట్రోల్ చేశారో నాకు తెలుసు. కానీ ఈ అన్నింటినీ నేను ఓర్చుకున్నాను. ఆ అనుభవాలు నన్ను ఇంకా బలంగా మార్చాయి. ఒక దశలో నేను పూర్తిగా విరిగిపోయాను. ఆ అనారోగ్యం నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ ఆ ఫేజ్ నాకు కొత్త బలం ఇచ్చింది” అని సమంత గుర్తుచేసుకుంది. మొత్తానికి సమంత మాటల్లో ఉన్న నిజాయితీ, ఆత్మవిశ్వాసం, జీవితం పట్ల ఉన్న ధైర్యం మరోసారి ఆమెని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలిపింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!