Samantha: స్టార్ హీరోయిన్స్.. కుటుంబం, స్నేహితులు కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్ ను మాత్రమే. పారితోషికాలు, సినిమాలు, ఈవెంట్స్ .. అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అయితే.. అంతగా నమ్మినవారిని మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే హీరోయిన్ రష్మికను మేనేజర్ మోసం చేసిన విషయం తెల్సిందే. ఆమెకు తెలియకుండా రూ. 50 లక్షల వరకు సదురు మేనేజర్ కాజేసాడని, అది సహించలేని రష్మిక అతడిని పనిలో నుంచి తీసేసిందని వార్తలు వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని, తాము ప్రొఫెషనల్ గానే విడిపోతున్నామని రష్మిక ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలిపింది. ఇక ఆ ఘటన ఇంకా మరువకముందే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అతని చేతిలో మోసపోవడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సామ్.. సినిమాలను ఆపేసి రెస్ట్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆమె.. ఖుషీ సినిమా ప్రమోషన్స్ కు కూడా హాజరుకాలేకపోయింది. అన్ని ఇంటర్వూస్ లో పాల్గొనకుండా.. కేవలం కొన్ని ఇంటర్వూస్ కు మాత్రమే పరిమితమయ్యింది.
Sudheer Babu: పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తానంటున్న మహేష్ బావ
ఇక తాను ప్రమోషన్స్ కు రానప్పుడు.. తనకోసం ఖర్చుపెట్టిన డబ్బు .. నిర్మాతలకు అధిక భారంగా మారుతుందని తెలిసి.. తన పారితోషికంతో రూ. 1 కోటిని తిరిగి ఇచ్చేయాలని మేనేజర్ కు తెలిపిందట.. కానీ, సదురు మేనేజర్ మాత్రం ఆమెకు తెలియకుండా మైత్రీ మూవీ మేకర్స్ వద్దకు వెళ్లి.. కోటి రూపాయలు క్యాష్ గా ఇవ్వమని కోరాడట. అంత మొత్తాన్ని క్యాష్ గా ఇవ్వలేమని వారు చెప్పడంతో తన ఫ్రెండ్ అకౌంట్ ఇస్తాను అని చెప్పడంతో అనుమాం వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సమంతకు ఇన్ఫార్మ్ చేయడంతో ఈ మోసం బయటపడిందని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా తన కుటుంబ సభ్యుడు అని నమ్మిన వ్యక్తి తనను మోసం చేయడంతో సామ్ ఈ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతోందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని తెలియాలంటే.. సామ్ ఓపెన్ అయ్యేవరకు ఆగాల్సిందే.