Naga Chaitanya: ఎన్ని ఏళ్ళు అయినా నాగ చైతన్య- సమంత విడాకుల గురించి అభిమానులు, నెటిజన్లు మర్చిపోరని అర్ధమవుతోంది. వారికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక గత కొన్నిరోజుల క్రితం సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం విదితమే. ఈ విషయాన్నీ ఆమె అధికారికంగా ప్రకటించడంతో సినీ అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేస్తున్నారు.
చివరికి సామ్ మరిది అక్కినేని అఖిల్ సైతం ఆమె కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశాడు. కానీ నాగ్ కానీ, చైతూ కానీ వెళ్లి కలవడం పక్కన పెడితే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదని అభిమానులు అసహనం వేయటం చేస్తున్నారు. అయితే నాగ్, చైతూ ఇద్దరు సామ్ ను పర్సనల్ గా వెళ్లి కలవడానికి ప్రయత్నించారు కానీ, చై షూటింగ్స్ కారణంగా డేట్స్ ను అడ్జెస్ట్ చేయలేక వెళ్లలేక పోయారట. అందుకే ఇటీవలే చై, సామ్ కు కాల్ చేసి పరామర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. షూటిగ్ వలన రాలేకపోయానని, త్వరలో కలుస్తానని చెప్పాడట. తండ్రి నాగ్ కూడా కొడుకుతో పాటు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఎట్టకేలకు చై స్పందించాడు అని తెలియడంతో సామ్ అభిమానులు కొద్దిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉన్నదో సి తెలియాలి.