సమంత రూత్ ప్రభు విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ పప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది. వ్యాయామం అనేది మానసికంగా, శారీరకంగా మరింత స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే సామ్ కూడా ఫిట్నెస్ ఫ్రీక్. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతుంది.

తీవ్రమైన ఫిట్‌నెస్ సెషన్ తర్వాత సమంతా రుచికరమైన సమోసాలను ఆరగించేసింది. సామ్ ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో మొదట తన హెవీవెయిట్‌లను ఎత్తే చిన్న క్లిప్‌ను షేర్ చేసింది. తదుపరి స్టోరీలో 2 చట్నీలతో వడ్డించిన సమోసాల ప్లేట్‌ను చూస్తూ సమంత చాలా సంతోషంగా కనిపించింది. తీవ్రమైన వర్కౌట్ తర్వాత ఈ స్టార్ హీరోయిన్ నోరూరించే, రుచికరమైన స్నాక్ తినడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
