Massive Sets For Nandamuri Kalyan Ram’s Movie Devil: నందమూరి హీరో అయినా సరే ముందు నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘డెవిల్”, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీగా ఖర్చు పెడుతూ దాదాపుగా 80కి పైగా సెట్స్ వేశారు. ఈ సెట్స్ ఫోటోలను తాజాగా రిలీజ్ చేయగా అవన్నీ సినిమా మీద ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఇక ఈ ‘డెవిల్’ మూవీ 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడంతో అప్పటి వాతావరణం కలిగించేలా దానికి తగ్గట్టు సెట్స్ రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ సినిమాకి సెట్స్ రూపొందించగా బ్రిటీష్ పరిపాలనలో మన దేశం ఉన్న సయమానికి చెందిన సెట్స్ వేయడం తనకెంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని గాంధీ వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ ను రూపొందించడానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించామని, నిర్మాత అభిషేక్ నామా సపోర్ట్ లేకుండా ఈ రేంజ్ లో భారీ సెట్స్ వేసి సినిమా రిచ్ గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదని ఆర్ట్ డైరెక్టర్ చెబుతున్నారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే ఈ సెట్స్ అన్నిటికీ కోట్లలోనే ఖర్చు అయి ఉంటుందని అంచనాలున్నాయి.
Kushi: “ఖుషి” కలెక్షన్స్ జోరు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
‘డెవిల్’ మూవీ కోసం వేసిన సెట్స్ విశేషాలు మీకోసం
* 1940 మద్రాస్ ప్రాంతంలో ఆంధ్ర క్లబ్
* బ్రిటిష్ కాలానికి తగ్గట్టు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు
* బ్రిటిష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు
* 1940 కాలానికి చెందిన కార్గో షిప్
* 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో)
* ఈ సెట్స్ వేయడానికి 9 ట్రక్కుల కలపను తెప్పించారట
* వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10 వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్ ను ఉపయోగించినట్టు యూనిట్ చెబుతోంది.