Samantha: సమంత.. సమంత.. సమంత.. నిత్యం ఈ బ్యూటీకి సంబంధించిన వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఆమె సినిమాలు ప్రస్తుతం విడుదల కాకపోయినా ఏదో ఒక టాపిక్ పై సామ్ వార్తలో నిలుస్తూనే ఉంది. అక్కినేని నాగ చైతన్య విడాకులతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. విడాకులు, విమర్శలు, సినిమాలు, ఫోటోషూట్ లు, సర్జరీలు, హెల్త్ సమస్యలు.. రాజకీయాలు.. ఇలా ఒకదాని తరువాత ఒకటి సామ్ పై రూమర్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న సామ్, సోషల్ మీడియాకు గ్యాప్ ఇవ్వడానికి కారణం చర్మ సమస్యలని, ప్రస్తుతం ఆమె అమెరికాలో చికిత్స తీసుకొంటుందని చెప్పుకొచ్చారు. ఇక చర్మ సమస్యలు కాదు ఏమి కాదు సర్జరీ చేయించుకోవడానికి వెళ్లిందని ఇంకొందరు చెప్పుకొచ్చారు. అయితే సామ్ ఎప్పటికైనా వీటిపై నోరు విప్పుతుందని ఆమె అభిమానులు కాచుకొని కూర్చున్నారు. ఇక ఈలోపే మరో పుకారు షికారు చేయడం మొదలుపెట్టింది.. అదేంటంటే.. త్వరలోనే సామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందట.
ఇక ఈ రెండో పెళ్లిని ఖరారు చేసింది ఆధ్యాత్మిక గురువు సద్గురు అని చెప్పుకొస్తున్నారు. సామ్ విడాకుల తర్వాత ఎక్కువ సద్గురు ఆశ్రమానికి, ఆయన ప్రవచనాలు వింటూ మానసిక ఒత్తిడి నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలోనే సద్గురు.. సామ్ కు ఉపదేశం చేసారని, ఒంటరిగా ఉండకుండా తోడును వెతుక్కోమని చెప్పారట.. ఒక మంచి వరుడును కూడా కూడా ఆయనే చూసినట్లు చెప్పుకొస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ పెళ్లి జరగనున్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్తను సామ్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. అసలు ఈ వార్తలో నమ్మదగ్గ అంశం ఏమైనా ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు. సద్గురు బాబా పెళ్లి చేయడమేంటి..? బుర్ర ఉండి మాట్లాడుతున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ దృష్టి అంతా సినిమాలపైనే ఉంది.. ఆమె పెళ్లి గురించి కానీ, వేరే వాటి గురించి కానీ ఏమి ఆలోచించడం లేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మొన్నటివరకు సర్జరీ అన్నారు.. ఇక ఇప్పుడు రెండో పెళ్లి అంటున్నారు.. నిజానిజాలు ఏంటో తెలిసి మాట్లాడండి అంటూ సామ్ సన్నిహితులు మండిపడుతున్నారట. ఇక వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే సామ్ స్ట్రాంగ్ సమాధానం చెప్పాల్సిందే.